ప్రజల మద్దతు కమలం పువ్వుకే. బిజెపి అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ
ఈ రోజు నిజామాబాదు నగరం లోని 21వ డివిజన్ లోనీ ఎల్లమ్మ గుట్ట లో బిజెపి అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నగర ప్రజలంతా కమలం పువ్వు కు వేసి భారీ మెజార్టీ గెలిపిస్తామని భోరోసా కల్పిస్తున్నారు అని అన్నారు. కేంద్రం లో మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనుసు ను గెలుచుకుంది అని అన్నారు రాష్ట్రంలో కూడా బిజెపి కి ఓటు వేస్తే మోదీ పాలనా అదే విదంగా ఉంటుంది అని అన్నారు. అన్ని పార్టీ లకు అవకాశం ఇచ్చారు ఒక్క సారి బిజెపి కి అవకాశం ఇవ్వాలని అన్నారు. నా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేశానని భవిష్యత్తులో కూడా ఇదే విదంగా ఉంటది అన్నారు నా ట్రస్ట్ ద్వారా కుల మతాల కు అతీతంగా సేవ కార్యక్రమాలు చేశానని అన్నారు. ఈ కార్యక్రమం లో 21 వ డివిజన్ ఇంచార్జి దొంతుల రవి, 20 వ డివిజన్ కార్పొరేటర్ న్యాలం రాజు, పంచారెడ్డి లావణ్య లింగం, పంచారెడ్డి ప్రవళిక, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి,sc మోర్చా అధ్యక్షులు BR శివ ప్రసాద్, మైనార్టీ అధ్యక్షులు కైసార్,డివిజన్ నాయకులు, బిట్టు, రాజేందర్ పాల్గొన్నారు .