మొక్కలునాటే కార్యక్రమం ఒక ఉద్యమంగా చేపట్టాలి - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్



(తెలంగాణ మెగా టైమ్స్ జూలై 5) నిజామాబాద్ ప్రతినిధి:  సారంగాపూర్ ఇందూర్ అర్బన్ పార్క్ లో జిల్లా అటవీశాఖ అధికారులు నిర్వహించిన 75వ వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.  జిల్లా అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.

 ఈ సందర్బంగా ధన్ పాల్ గారు మాట్లాడుతు పర్యావరణం అంటేనే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని ఇదే మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత అవశ్యకం అని అటువంటి పర్యావరణం మొత్తం కాలుష్యం అవుతుందని హిందూ సంస్కృతి ప్రకారం సౌర శక్తిని సూర్యదేవునిగా, జలాన్ని గంగాదేవిగా కొలుస్తూ చెట్లను కూడా పూజించే సంస్కృతి మన భారతదేశంలోనే ఉందని ఔషాద గుణం ఉన్న చెట్లు అరటి, రావి, తులసి, మర్రి, మామిడి, వేప వంటి చెట్లు పెరట్లో పెట్టుకొని  పూజించేవాళ్ళం అని కానీ నేడు వాటిని పూజించడానికి గుడికి వెళ్ళసిన పరిస్థితి ఉందని,కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు RSS వంటి సంస్థలు పెరుగుతున్న జనాభా, తరుగుతున్నా ఉత్పాదకత మానవ జాతి మనుగడకే ప్రమాదం అని దీని ప్రభావం పర్యావరణం పై పడుతుందని 2018 సంవత్సరం ఆగస్టు 15 నుండి 22 వరకు దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షలకు పైగ నీడనిచ్చే, ఔషాద మొక్కలు నాటడం జరిగిందని, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు అమ్మ పేరు మీద మొక్క నాటలని పిలుపునివ్వడం జరిగిందని,పట్టణాలలో నానాటికి కాలుష్యం పెరిగిపోతుందని భవిష్యత్ తరాల మన పిల్లలు బాగుండాలన్నా కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలన్న మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అనేది చాలా ముఖ్యం అని అడవులను కాపాడుకోవలిసిన బాధ్యత, చెట్లను పెంచే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకున్న రోజే మనం ఈ కాలుష్యన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుకోగాలుగుతామని,ఈ 75వ వన మహోత్సవం సందర్బంగా మనం అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని వాటి సంరక్షనను ఒక ఉద్యమంల చేపట్టి పర్యావరణాన్ని కాపాడుదాం అని పిలుపునిచ్చారు,

ధర్మో రక్షతి రక్షిత: అన్నట్లు వృక్షో రక్షతి రక్షిత : అంటే వృక్షన్ని మనము కాపాడితే వృక్షాలు మనల్ని కాపాడుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో వికాస్ మీనా IFS గారు, సుధాకర్ DFO గారు, పద్మారావు FRO గారు, రాధికా FRO గారు, సివిల్ హాస్పిటల్  సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్ బిజెపి జిల్లా ఉపఅధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, ప్రభాకర్, ఆనంద్, పవన్, హరీష్, మున్నా తదితరులు పాల్గొన్నారు.