సమస్త మానవాళికి భగవత్ గీతే ఆదర్శం. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్








( తెలంగాణ మేఘ టైమ్స్ జూలై 9 ): నిజామాబాద్ ప్రతినిధి: సమస్త మానవాళికి భగవత్ గీతే ఆదర్శం  అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  సూర్యనారాయణ గుప్త అన్నారు. నగరంలోని  ఉమామహేశ్వర ఆలయంలో అయ్యప్ప భక్త బృందం వారు నిర్వహిస్తున్న  శ్రీమద్భాగవత సప్తాహ ప్రవచనమునకు  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  సూర్యనారాయణ గుప్త ముఖ్య అతిథిగా  హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి బ్రహ్మశ్రీ ఫణతుల మేఘరాజ్ శర్మ ఇందూర్ నగర ప్రజలకు భగవత్ గీత భోదించడానికి విచ్చేయాడం జరిగిందని అన్నారు.,03-07-24 నుండి 10-07-24 వరకు ఉదయం సాయంత్రం గీత పారాయణం జరుగుతుందని ప్రతి హిందువు చిన్న, పెద్ద వయస్సుతో నిమిత్తం లేకుండ భగవత్ గీత చదవాలని, వినాలని వ్యక్తి ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవడం వలన మనస్సు ఉల్లాసంగా ఉంటుందని, మానసిక ప్రశాంతతా దొరుకుతుందని, వేదాలు, ఉపనిషత్తుల సారమే భగవత్ గీత అని, వ్యక్తిలో భక్తి భావాలు పెంపొందించుకోవడం వలన మనిషి ధర్మం వైపు అడుగులు వేస్తారని, సేవ భావాలు పెంపొందుతాయని తెలిపారు,


 ప్రతి మనిషి జీవితం ఒక రణరంగమే అని మనిషి నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు భగవత్ గీత ఒక మార్గాన్ని చూపెడుతుందని  ఆనాడు అర్జునికి శ్రీ క్రిష్ణ పరమాత్ముడు చేసిన ఉపదేశామే భగవత్ గీత అని శ్రీ శ్రీ స్వామి బ్రహ్మశ్రీ ఫణతుల మేఘరాజ్ శర్మ గారి  శ్రీమద్భాగవత సప్తాహ ప్రవచనము కార్యక్రమం మరియు రేపు  తేదీ 10-07-2024 బధవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు జరగబోయే రుక్మిణి కళ్యాణం తధానంతరం అన్న ప్రసాదం కలదు కావున తామెల్లరు కుటుంబ సమేతంగా స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఇందూర్ భక్తులందరు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం   చేయాలని పిలుపునిచ్చారు