( తెలంగాణ మెగా టైమ్స్ జూలై 5:) నిజామాబాద్ ప్రతినిధి: ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI)నిజామాబాద్ జిల్లా కమిటీలో మాజీ విద్యార్థి సంఘ నాయకులు నిజామాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రెస్ క్లబ్ లో యుఎస్ఎఫ్ఐ లో చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాడిశెట్టి అరుణ్ కుమార్ హాజరై వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం మాడిశెట్టి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నేడు యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలో చేరడం శుభసూచకమని నిరంతరం విద్యారంగ సమస్యల పరిష్కారానికై నిరంతరం సమరశి ల పోరాటలు నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల విద్య రోజు రోజుకు అందని ద్రాక్షలాగా మారిందని, పేదవాడికి మరింత దూరం చేసేగా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల యూపీఎస్సీ నీట్ నెట్టు లాంటి ప్రాముఖ్యత గల పరీక్ష పేపర్లు లీక్ అవ్వడం సిగ్గుచేటు అన్నారు. ఈ లీకులకు బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రల హక్కులను హరిస్తుందని దానివల్ల దేశ సమగ్రత దెబ్బతింటుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలకు గుర్తు చేశారు. అలాగే నీట్ పరీక్ష పై కేంద్రం తక్షణమే స్పందించి బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని లేని పక్షంలో ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు అలాగే తక్షణమే యూనివర్సిటీలకు రెగ్యులర్ విసిల నియమించాలని ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ ఇతర పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ సమస్యపై క్యాలెండర్ రిలీజ్ చేయాలని అన్నారు విద్యార్థి సంఘ నాయకులను యువజన సంఘాల నాయకులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేయాలని అన్నారు .ఈరోజు నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. విరు భవిష్యత్తులో విద్యారంగా జిల్లా విద్యారంగా అభివృద్ధి కోసం ఉద్యమాలు నిర్వహించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిగా పెద్దిసూరి జిల్లా అధ్యక్షులుగా సంజయ్ తలారే జిల్లా సహాయ కార్యదర్శిగా నాగరాజు మహేష్ గణేషు జిల్లా ఉపాధ్యక్షులుగా మంగేష్ సోని ఆశీర్వాదం, కమిటీ సభ్యులుగా 25 మందిని ఎన్నుకున్నారు.
v