వాహన బీమా తీసుకోని వారికి ైజైలు శిక్ష


 ( తెలంగాణ మేఘ టైమ్స్ జూలై 9 ): నిజామాబాద్ ప్రతినిధి: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఇప్పుడు తప్పనిసరి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం ఇప్పుడు శిక్షార్హమైన నేరం. అంతేకాదు, వాహన బీమా తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడపడం ఇకనుంచి శిక్షారమైన నేరం అవుతుంది. మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్ 196 కింద భారతీయ రోడ్లపై తిరిగి అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా ఉండితీరాలి. థర్డ్ పార్టీ బీమా కలిగి ఉండడం తప్పనిసరి కావడంతో ప్రమాదాలు లేదా నష్టాల కేసుల్లో బాధితులకు తేలిగ్గా సహాయం అందుతుంది.